సైబర్ పోలీసునంటూ బెదిరించి లక్షలు కొల్లగొట్టిన యువకుడు అరెస్ట్

838చూసినవారు
సైబర్ పోలీసునంటూ బెదిరించి లక్షలు కొల్లగొట్టిన యువకుడు అరెస్ట్
సైబర్ క్రైమ్ పోలీసు అధికారిగా నటిస్తూ అమాయకులను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్న జాలా సాయి రామ్ రెడ్డి అనే యువకుడిని ఎస్సార్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌ జిల్లా పులిగిల్ల పరకాలకు చెందిన సాయి రామ్‌రెడ్డి కరీంనగర్‌లో నివాసముంటున్నాడు. షేర్‌చాట్‌లో నకిలీ ఖాతాలు సృష్టించి, బాధితుల ఫోన్ నంబర్లు సేకరించి, తాను సైబర్ పోలీసునని, అసభ్య కార్యకలాపాల్లో పాల్గొన్నారని బెదిరించి, జరిమానా పేరుతో యూపీఐ ఖాతాల్లోకి డబ్బు జమ చేయించుకునేవాడు. ఇటీవల ఒక విద్యార్థిని బెదిరించి రూ.97,540 వసూలు చేశాడు. జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదుతో పోలీసులు సాంకేతికతను ఉపయోగించి నిందితుడిని పట్టుకున్నారు. అతను మరికొందరితో కలిసి అనేక సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు, యూపీఐ స్కానర్లు ఉపయోగించి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్