
త్వరలోనే పెన్షన్లపై తీపి కబురు: పొంగులేటి
పెన్షన్లపై త్వరలోనే తీపి కబురు వస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువులో బుధవారం పర్యటించారు. సమస్యల పరిష్కారానికి ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ఏర్పాటు చేశామన్నారు. రైతులకు రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. జూన్ 2న రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. లంచం లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని అన్నారు.






































