ధర్మసాగర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక

641చూసినవారు
ధర్మసాగర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక
ఇబ్రహీంపట్నం ధర్మసాగర్ కాలనీ వాసుల కమిటి ఏర్పాటుకు కార్యవర్గ సమావేశంలో కాలనీ వాసులందరి సమక్షంలో నూతన కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు వేంకటాద్రి, ఉపాధ్యక్షులు మొహమ్మద్ నభి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్, కోశాధికారి అబ్దుల్ బాబా, ఖాతాదారుడు సతీష్, సహాయ కార్యదర్శి రాజు, కార్యనిర్వహక సభ్యుడుగా సాజిద్ లను ఎన్నుకోవడం జరిగింది. అనంతరం కాలనీ వాసులు, సభ్యులు అధ్యక్షులు వేంకటాద్రి ని శాలువాతో సన్మానించి, స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. కాలనీకి కావలసిన సౌకర్యాల కొరకు, అభివృద్ధికి కృషి చేస్తామని అధ్యక్షులు, కమిటి సభ్యులు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, కమిటి సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్