మెట్పల్లి లో ఘనంగా అంతర్జాతీయ ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు

916చూసినవారు
మెట్పల్లి లో ఘనంగా అంతర్జాతీయ ప్రపంచ కరాటే దినోత్సవ వేడుకలు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండల ప్రధాన శిక్షకులు వంశినాయుడు మాస్టర్ అధ్వర్యంలో శనివారం అంతర్జాతీయ ప్రపంచ కరాటే దినోత్సవ సందర్బంగా మెట్పల్లి కేంద్రంలో 50 మంది కరాటే విద్యార్ధులు, తల్లితండ్రుల సమక్షంలో వేడుక నిర్వహించి విద్యార్థులకు కేకు పంచడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా ప్రధాన శిక్షకులు మాట్లాడుతూ కరాటే గురించి వివరిస్తూ ప్రపంచ స్థాయిలో కరాటే విద్య ప్రాచుర్యం పొంది, ప్రఖ్యాతి గాంచిన కళ గా అభివృధి చెందిందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బాసర జోన్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ సురేందర్, జిల్లా ప్రధాన శిక్షకులు మాస్టర్ ప్రవీణ్ కుమార్, మెట్పల్లి మండల ప్రధాన శిక్షకులు వంశినాయడు, శివ, కరాటే విద్యార్థులు, తల్లితండ్రులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్