
మెట్ పల్లి శ్రీ శివ భక్త మార్కండేయ మందిరానికి లక్ష విరాళం
జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన, ముంబైలో నివసిస్తున్న మార్గం రాజ్ పాల్, తన తండ్రి రాజారాం పేరుతో మెట్ పల్లి శ్రీ శివ భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణానికి రూ. 1,01,116 విరాళంగా ఇచ్చి మహారాజ పోషకులుగా సభ్యత్వం తీసుకున్నారు. మెట్ పల్లి పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు ద్యావనపల్లి రాజారాం మాట్లాడుతూ, రాజ్ పాల్, ఆయన కుటుంబ సభ్యులకు శ్రీ శివభక్త మార్కండేయ స్వామి, శ్రీ లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.







































