
మెట్పల్లి: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
మెట్పల్లి మండలం మేడిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రైతుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి, ఏపీఎం అశోక్, ఆర్ఐ ఉమేష్, మాజీ ఎంపిటిసి నాగేష్ పాల్గొన్నారు.






































