
అయిలాపూర్ ఆలయంలో మహిళల దీపారాధన
కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామంలోని శ్రీ అనంతపద్మనాభ స్వామి, హనుమాన్, శివాలయాలలో బుధవారం రాత్రి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఉసిరి, పిండితో చేసిన దీపాలను వెలిగించి, ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, నైవేద్యాలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీపారాధనలతో ఆలయం కాంతివంతంగా మారింది.






































