
మెట్పల్లిలో 6 ఇళ్లలో దొంగతనం, ప్రజలు అప్రమత్తం
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లి గ్రామంలో మార్చి 10, 11 తేదీల మధ్య రాత్రి సమయంలో 6 ఇళ్లలో దొంగలు తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేశవపట్నం ఎస్సై సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ దొంగతనంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.








































