
నాగుల చవితి: పుట్ట వద్ద పెంజర్ కట్టలో మహిళల ప్రత్యేక పూజలు
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని పెంజర్ కట్టలో శనివారం నాగుల చవితి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పుట్ట వద్దకు చేరుకున్నారు. ఆవు పాలు, జామ పండ్లు, అరటి పండ్లు, సీతాఫలాలు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిమంది భక్తుల కోరికలు తీర్చే ఈ దేవాలయానికి గుడి నిర్మాణం ఎందుకు జరగడం లేదని భక్తులు ప్రశ్నించారు. నాగదేవత విశిష్టత, గుడి గురించి భక్తురాలు చక్కటి సందేశం ఇచ్చారు.




































