సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ వాహనాన్ని తనిఖీ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు వాహనాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎన్నికల నిబంధనలకు పూర్తిగా కట్టుబడి, అధికారులకు కేటీఆర్ సహకరించారు. తనిఖీల అనంతరం ఎలాంటి అభ్యంతరకర వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం చేపట్టే తనిఖీలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు.
