
గ్రంథాలయానికి గ్రూప్ 2 బుక్స్ పంపిణీ
పెద్దపల్లి పట్టణంలోని గ్రంథాలయానికి గ్రూప్ 2 పరీక్షలకు అవసరమైన పుస్తకాలను మానిటర్ శివరాం సేకరించారు. పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ దాసరి ఉషా ఆధ్వర్యంలో శనివారం ఈ పుస్తకాలను పంపిణీ చేశారు. ప్రభుత్వం కొత్త గ్రంథాలయ భవన నిర్మాణానికి నిధులు కేటాయించడంపై ఉషా హర్షం వ్యక్తం చేశారు. అనంతరం, పెద్దపల్లి మండలం కాసులపల్లిలో మృతి చెందిన దాసరి రఘునందన్ రెడ్డి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.








































