పెద్దపల్లి: రైతుల కళ్ళముందే కాలిపోయిన ధాన్యం

527చూసినవారు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం(M) పొట్యాల గ్రామంలోని IKP కేంద్రంలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. సెంటర్‌కు సమీపంలో వరి కొయ్యలకు నిప్పు అంటుకోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కొంత మేరకు వరి ధాన్యంతో పాటు గన్ని సంచులు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. చేతికి వచ్చిన పంట కళ్ల ముందే కాలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్