పెద్దపల్లి జిల్లా గొల్లపల్లి (రాఘవాపూర్)లో దొంగలు బీభత్సం సృష్టించారు. రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి గాజుల స్వామి తన మనవరాలి ఫంక్షన్ కోసం గోదావరిఖనికి వెళ్లిన సమయంలో, గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి 20 తులాల వెండి, రూ.5,000 నగదును దొంగిలించారు. స్వామి తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు గుల్లై ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న SI శ్వేత, క్లూస్ టీమ్ సహాయంతో కేసు దర్యాప్తు చేపట్టారు.