
యువతకు మార్గదర్శకుడు స్వామి వివేకానంద: ఎమ్మెల్యే
పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు మాట్లాడుతూ, స్వామి వివేకానంద యువతకు మార్గదర్శకుడని అన్నారు. సోమవారం సుల్తానాబాద్ పట్టణంలో స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొని, ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. వివేకానంద తన బోధనలతో భారతదేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారని, నేటి యువతకు ఆయన ఆదర్శప్రాయుడని కొనియాడారు. దేశ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి యువతను మేల్కొల్పిన దార్శనికుడని, ఆయన బోధనలను పాటిస్తే యువతకు తిరుగు లేదని పేర్కొన్నారు.





































