
బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి..
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సోమవారం కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవాలని ఆయన అన్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని, లేదంటే మరోసారి మోసపోతారని ఆయన పేర్కొన్నారు.





































