Dec 15, 2025, 10:12 IST/
ఎమ్మెల్యే స్వగ్రామంలో బీజేపీ గెలుపు: అనిరుధ్ రెడ్డి ఆవేదన
Dec 15, 2025, 10:12 IST
తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ముగియగా, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపొందింది. అయితే, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డిగూడలో అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి రేవతి 31 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితంపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పందిస్తూ.. సొంత ఊరివారే తనను మోసం చేశారని, బయటి పార్టీల కుట్రల వల్లే తన అభ్యర్థి ఓడిపోయారని ఆరోపించారు. అయినప్పటికీ, జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధి ఆగదని ఆయన స్పష్టం చేశారు.