పెద్దపల్లి - Peddapalli

వీడియోలు


పెద్దపల్లి జిల్లా
తండ్రి హత్యకు ప్రతీకారం.. 46 ఏళ్ల పగ తీర్చుకున్న కొడుకు
Nov 28, 2025, 04:11 IST/సిరిసిల్ల
సిరిసిల్ల

తండ్రి హత్యకు ప్రతీకారం.. 46 ఏళ్ల పగ తీర్చుకున్న కొడుకు

Nov 28, 2025, 04:11 IST
సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో మాజీ నక్సలైట్, బీఆర్ఎస్ నాయకుడు బల్లెపు నర్సయ్య (58) అలియాస్ పీపుల్స్ వార్ సిద్ధన్న హత్య కేసులో నిందితుడు సంతోష్ గురువారం రాత్రి జగిత్యాల పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. సుమారు 46 ఏళ్ల క్రితం తన తండ్రిని హత్య చేసినట్లు నరసయ్య ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పేర్కొన్న సమాచారం ఆధారంగా సంతోష్ పగ తీర్చుకునేందుకు పథకం వేసి, స్నేహం ముసుగులో నర్సయ్యను అగ్రహారం గుట్టకు పిలిపించి హత్య చేసినట్లు తెలుస్తోంది. అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు.