రాజన్న సిరిసిల్ల: దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా అరెస్టు

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల: దొంగతనాలకు పాల్పడిన దొంగల ముఠా అరెస్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం పరిధిలో వివిధ దొంగతనాలకు పాల్పడిన నలుగురు సభ్యుల దొంగల ముఠాను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. సికింద్రాబాద్, మేడ్చల్ జిల్లాల్లో దొంగతనాలు చేసి జల్సాలకు అలవాటు పడిన సంగేమ్ జంపయ్య, పూజారి శంకర్, కండెల్లి జయప్రకాష్, గోలు శంకర్ అనే నలుగురు వ్యక్తులు కోళ్లమద్దిలో మోటార్, మల్లారెడ్డిపేటలో గొర్రెలు, జగదాంబ తండాలో గ్రామపంచాయతీ మోటార్, ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారం గ్రామంలో వైరు దొంగతనం చేశారని వివరించారు. సముద్రలింగాపూర్ గ్రామంలో దొంగతనం చేస్తుండగా పోలీసుల పెట్రోలింగ్‌లో వీరు పట్టుబడ్డారు. వారిపై నమోదైన కేసుల విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.