రామగిరి మండలం బుధవారంపేట, రాజాపూర్ గ్రామాలలో సింగరేణి కోసం చేపట్టిన భూసేకరణ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ఆదేశించారు. గురువారం రామగిరి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారంపేట, రాజాపూర్ గ్రామాలలో భూ సేకరణ సంబంధించి ఎంజాయ్ మెంట్ సర్వే పూర్తయిందని, అవార్డుల పై రైతులు అందించే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.