అప్పుల బాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య

0చూసినవారు
అప్పుల బాధతో సింగరేణి కార్మికుడు ఆత్మహత్య
గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు మింగనబోయిన భార్గవ్ (28) అప్పుల బాధతో మంగళవారం ఉదయం తన ఇంటి వెనుక షెడ్డులో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రెండేళ్లుగా భూగర్భ గనిలోకి దిగి పనిచేయాలంటే భయంగా ఉందని విధులకు హాజరు కావడం లేదు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరగడంతో మనస్తాపానికి గురయ్యాడు. భార్గవ్ కుటుంబంలో ఇది మూడవ మరణం. అతని తండ్రి, అన్న కూడా గతంలో మరణించారు. ప్రస్తుతం తల్లి, సోదరి, అత్త మాత్రమే మిగిలారు.

సంబంధిత పోస్ట్