
రోడ్డు ప్రమాదాలు తగ్గించడమే లక్ష్యం: సీపీ
రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యమని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రూపొందించిన అరైవ్– అలైవ్ పోస్టర్‌ను సీపీ తన కార్యాలయంలో పోలీస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. రోడ్డు ప్రమాదాలతో అనేక కుటుంబాలు నష్టపోతున్నాయని, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన తప్పనిసరిగా పెరగాలని ఆయన సూచించారు. మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్ వంటి నిర్లక్ష్యపు చర్యలే ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
































