కరీంనగర్ నగరపాలక ఎన్నికల్లో టికెట్ దక్కని ఆశావహులు స్వతంత్రులుగా బరిలోకి దిగడంతో ప్రధాన పార్టీలకు 'రెబల్స్' సవాల్ విసురుతున్నారు. అధిష్ఠానాల బుజ్జగింపులు ఫలించకపోవడంతో పలు డివిజన్లలో రెబల్స్ పోటీలో నిలిచారు. గ్రూపు రాజకీయాల నేపథ్యంలో సొంత పార్టీ నేతలే గోతులు తవ్వుతారేమోనని, ఓట్లు చీలిపోతాయేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నగరాభివృద్ధిపై భరోసా కల్పించాల్సిన వేళ ఈ రెబల్స్ ప్రధాన పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారారు.