సిరిసిల్ల: ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి: కలెక్టర్‌

0చూసినవారు
సిరిసిల్ల: ధాన్యం తరలింపును వేగవంతం చేయాలి: కలెక్టర్‌
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు, మిల్లులకు తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగర్వాల్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో కొనుగోలు కేంద్రాలు, మిల్లుల్లో అన్‌లోడింగ్‌పై ఆమె సమీక్షించారు. కేంద్రాల్లో నిల్వ ఉన్న బస్తాలను వెంటనే తరలించేందుకు వీలుగా లారీలు, హమాలీల సంఖ్యను పెంచాలని, వర్ష సూచన మేరకు ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటూ కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్