రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో జరిగిన రెండు మోటార్ సైకిళ్ల దొంగతనం కేసులో నిందితుడికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ బుధవారం తీర్పు వెల్లడించారు. 2025 డిసెంబర్ 31న సిరిసిల్ల బస్టాండ్ సమీపంలో కొక్కుల అనిల్ కుమార్ పార్క్ చేసిన మోటార్ సైకిల్‌ను, పెద్దబజార్ ప్రాంతానికి చెందిన రామోజు రమేష్ ఇంటి వద్ద పార్క్ చేసిన మరో మోటార్ సైకిల్‌ను దొంగిలించినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిందితుడికి శిక్ష పడినట్లు సిరిసిల్ల పట్టణ సీఐ శ్రీనివాస్ తెలిపారు.