
జిలేబీలు వేసిన న్యూజిలాండ్ ప్రధాని (వీడియో)
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఇటీవల ఆక్లాండ్‌లో జరిగిన సిక్కు క్రీడల సందర్భంగా జిలేబీలు తయారు చేయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని లక్సన్ క్రీడలకు హాజరై, అక్కడ జిలేబీలు వేస్తూ సందడి చేశారు. ఈ దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.




