తంగళ్ళపల్లి ట్రైబల్ డిగ్రీ కాలేజీలో భరోసా అవగాహన సదస్సు

0చూసినవారు
తంగళ్ళపల్లి ట్రైబల్ డిగ్రీ కాలేజీలో భరోసా అవగాహన సదస్సు
రాజన్న సిరిసిల్లలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా డ్రగ్స్ రహిత తెలంగాణ వారోత్సవాల సందర్భంగా, ఎస్పీ మహేష్ బి. గితే ఆదేశాలతో భరోసా కేంద్రం ఎస్ఐ వీనిత రెడ్డి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి ట్రైబల్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో సదస్సు జరిగింది. ఈ సదస్సులో విద్యార్థినులకు భరోసా సేవలు, పోక్సో చట్టం, బాల్య వివాహాల నిరోధం, సైబర్ నేరాలు, సైబర్ స్టాకింగ్, హెల్ప్‌లైన్ 1098, 1930లపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మహిళా కానిస్టేబుళ్లు ప్రవళిక, శిరీష, సిబ్బంది మల్లీశ్వరి, స్వాభావతి, పవనిత పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you