ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ, జిల్లాలో 1 పాజిటివ్ కేసు గుర్తింపు

0చూసినవారు
ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ, జిల్లాలో 1 పాజిటివ్ కేసు గుర్తింపు
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల గవర్నమెంట్ హాస్పిటల్‌లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సమావేశం జరిగింది. డాక్టర్ రజిత ఎయిడ్స్ నివారణ, జాగ్రత్తలు, చికిత్సపై వివరించారు. జిల్లాలో గర్భిణీల పరీక్షల్లో 1 పాజిటివ్ కేసు, అనుమానితుల్లో 26 కేసులు గుర్తించినట్లు తెలిపారు. అవగాహన కార్యక్రమాలను గ్రామాల్లో మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సేవకులకు మెమెంటోలు అందజేసి, అనంతరం అవగాహన ర్యాలీ ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్