రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో వీర్నపల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ పరిధిలోని రాశి గుట్ట తండాకు చెందిన మృతుడు గుగులోత్ లింగం నామినీ లావణ్యకు ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద ₹2 లక్షల బీమా చెక్కును మేనేజర్ ముదం సంతోష్ శుక్రవారం అందజేశారు. తక్కువ ప్రీమియంతో లభించే ఈ బీమా పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, క్యాషియర్ అరుణ్ పాల్గొన్నారు.