బతుకమ్మ వేడుకల్లో బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఎం. శిల్పారెడ్డి సందడి

224చూసినవారు
బతుకమ్మ వేడుకల్లో బీజేపీ మహిళా అధ్యక్షురాలు ఎం. శిల్పారెడ్డి సందడి
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎం. శిల్పారెడ్డి హాజరయ్యారు. సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, స్థానిక మహిళలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పూలతో బతుకమ్మ పేర్చి, డప్పు చప్పుళ్ళ మధ్య కోలాటం ఆడుతూ, వందలాది మంది మహిళలతో కలిసి "దాండియా కార్యక్రమం"లో పాల్గొన్నారు. బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి.

సంబంధిత పోస్ట్