నేడు బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుందని ‘X’లో కేసీఆర్ ఫొటోతో సోమవారం ట్వీట్ చేశారు. బీఆర్‌ఎస్ రాజకీయ పార్టీ కాదని.. ఓ విప్లవమన్నారు. 'స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ.. సిల్వర్ జూబ్లీ వేడుకను చేసుకొంటున్న సన్నివేశం! 25 వసంతాల మైలురాయిని అధిగమించిన మహోజ్వల లాంగ్ మార్చ్' అని పేర్కొన్నారు.