రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల ఎక్స్‌రోడ్ వద్ద ఆదివారం, బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై చేపట్టిన సిట్ విచారణకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాయి. గ్రామ శాఖ అధ్యక్షుడు అబ్బాడి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి, రాజకీయ కక్ష సాధింపులు మానుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మాట్ల మధుతోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.