భూముల అవకతవకలపై కలెక్టర్ల సమీక్ష: చర్యలకు ఆదేశాలు

643చూసినవారు
భూముల అవకతవకలపై కలెక్టర్ల సమీక్ష: చర్యలకు ఆదేశాలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ సభ్యుడు, జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జరిగిన ఈ సమావేశంలో తహసీల్దార్లు పాల్గొన్నారు. భూములకు సంబంధించిన అవకతవకలపై సమీక్షించి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్