రోడ్డు ప్రమాదంలో కండక్టర్ రాజేశం మృతి

1చూసినవారు
రోడ్డు ప్రమాదంలో కండక్టర్ రాజేశం మృతి
నూతన సంవత్సర వేడుకల వేళ విషాద ఘటన చోటుచేసుకుంది. కొండన్నపేట గ్రామానికి చెందిన రాజేశం అనే కండక్టర్ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విధులు ముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటి వైపు వెళ్తున్న సమయంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you