ఎర్రగడ్డలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం జోరు

468చూసినవారు
జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్‌లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, సిరిసిల్ల ఇంచార్జి కె.కె. మహేందర్ రెడ్డిల సూచనల మేరకు తంగళ్లపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆనందనగర్‌లో ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని, జూబ్లీహిల్స్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీయే అండగా నిలుస్తుందని వారు పిలుపునిచ్చారు. ఈ ప్రచారంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జాలగం ప్రవీణ్, సోషల్ మీడియా ఇంచార్జి గడ్డం మధుకర్, జిల్లా యువజన నాయకులు గుగ్గిళ్ల భరత్, ఎడ్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్