తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకల్లో BRS నేత కేటీఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. క్యాలెండర్లు మారుతున్నా రెండేళ్లుగా ప్రజల జీవితంలో మార్పు లేదని, రైతులకు యూరియా దొరకని స్థితి నెలకొందని ఆయన అన్నారు. ప్రభుత్వంపై పోరాటం సాగిస్తూనే పటిష్ఠమైన క్యాడర్ను ఏర్పాటు చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.