రాళ్లపేటలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి: గురువారం గృహప్రవేశాలు

0చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని రాళ్లపేట, అంకిరెడ్డిపల్లె, అంకుసాపూర్, కస్బే కట్కూర్, మండేపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. అధికారులు, స్థానిక నాయకులు మంగళవారం రోజున నిర్మాణ పనులను పరిశీలించారు. తంగళ్ళపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ జె టోనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల ఆరవ తేదీ గురువారం రోజున అధికారికంగా గృహప్రవేశాలు నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్