
పంచాయతీ ఆఫీసు తాళాలు పగలగొట్టి.. నామినేషన్ పత్రాలు చోరీ
TG: వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తాండూర్ నియోజకవర్గంలో పెద్దేముల్ మండలం గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి నామినేషన్ క్లస్టర్ లో ఉన్న నామినేషన్ పత్రాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో గొట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, జయరాం తండా(ఐ) గ్రామాలకు సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నారు.




