రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి. ఆర్‌జిఎన్ హ్యూమన్ రైట్స్ మరియు యాంటీ కరప్షన్ అసోసియేషన్ సభ్యులు, జిల్లా ఇంచార్జ్ పంజా బాలరాజు ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలంలోని గ్రామాల్లో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. రైతులు ఎకరాకు రూ.50 వేల నష్టపరిహారం ఇవ్వాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.