జిల్లెల్లలో అరగంటలో దట్టమైన పొగమంచు.. గ్రామస్తులు ఆశ్చర్యం

1చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం ఉదయం 6 గంటల వరకు సాధారణంగా ఉన్న వాతావరణం, కేవలం అరగంట వ్యవధిలోనే అంటే 6:30 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచుతో నిండిపోయింది. గ్రామంలో ఒక మనిషికి మరొక మనిషి కనిపించనంతగా మంచు కమ్మేయడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అకస్మాత్తుగా ఇంత భారీ స్థాయిలో పొగమంచు కురవడంపై గ్రామస్తులు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్