రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో రోగ నిర్ధారణ పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై, అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు.