
ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు.. గల్ఫ్ దేశాల్లో ఉద్రిక్తతలు
ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు మళ్లీ ప్రారంభించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మృతిచెందగా, 63 మంది గాయపడ్డారు. ఇరాన్ దాడిలో విమానాశ్రయ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. గెరుక్, ఖేష్మ్ దీవిపై అమెరికా దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేసినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. కువైట్, బహ్రెయిన్ ప్రభుత్వాలు ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించాయి. అమెరికా సైన్యం ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్‌లను అడ్డుకున్నట్లు పేర్కొంది.




