తంగళ్ళపల్లి మండలంలోని జిల్లెల్ల గ్రామ సర్పంచ్ స్థానానికి డి యర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు దుబ్బాక రమేష్ భార్య రజిత నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక రమేష్ మాట్లాడుతూ, తాను జిల్లెల్లలోనే పుట్టి పెరిగానని, గ్రామాన్ని విడిచి ఎక్కడికీ పోలేదని, జిల్లెల్ల పోచమ్మ, మల్లాపూర్ ఎల్లమ్మ తల్లి మీద ప్రమాణం చేసి గ్రామానికే సేవ చేస్తానని, ఇక్కడే ఉంటానని తెలిపారు. పదవి రాకముందే ఐదేళ్లుగా బడిలో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు వంటి సేవలు చేశామని గుర్తుచేశారు. బీసీ మహిళా రిజర్వేషన్ రావడంతో తన భార్య రజిత నామినేషన్ వేస్తున్నారని, గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని కోరారు.