రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. జూబ్లీహిల్స్ అభివృద్ధికి మాగంటి సునీత సరైన అభ్యర్థి అని, ప్రజలు ఆమెను గెలిపించాలని తోట ఆగయ్య పిలుపునిచ్చారు.