సిరిసిల్ల 22వ వార్డులో తాగునీటి కష్టాలు: నల్లా కనెక్షన్ల కోసం ప్రజల ఆందోళన

0చూసినవారు
సిరిసిల్ల 22వ వార్డులో తాగునీటి కష్టాలు: నల్లా కనెక్షన్ల కోసం ప్రజల ఆందోళన
రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్లలోని 22వ వార్డులో ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. పలు కుటుంబాలకు నల్లా కనెక్షన్లు లేకపోవడంతో, పొలాల నుంచి ఆటోల్లో నీటిని తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యపై వార్డు కౌన్సిలర్‌కు, మున్సిపల్ అధికారులకు పలుమార్లు విన్నవించినా పరిష్కారం లభించలేదని బుధవారం స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరంగా తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని వారు కోరుతున్నారు. మున్సిపల్ అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం కూడా రావడం లేదని ప్రజలు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్