సిరిసిల్లలో “మందుబాబుల వినతి పత్రం” వైరల్‌!

2చూసినవారు
సిరిసిల్లలో “మందుబాబుల వినతి పత్రం” వైరల్‌!
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 'మద్యం ప్రియుల సంక్షేమ సంఘం' పేరుతో జిల్లా కలెక్టర్‌కు రాసినట్లుగా ప్రచారంలో ఉన్న ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలంగాణలో ఇప్పటికే అధికంగా ఉన్న మద్యం ధరలను మరో 20-30% పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, ఇది సాధారణ, కార్మిక వర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని లేఖలో పేర్కొన్నారు. ధరల పెంపును ఆపి, యథావిధిగా కొనసాగించాలని కలెక్టర్‌ను కోరారు.