పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్లతో ఎన్నికల కమిషనర్ సమీక్ష

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ. రాణి కుముదిని, పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రలోభాలు లేకుండా పర్యవేక్షణ కట్టుదిట్టం చేయడం, నామినేషన్ల తర్వాత గుర్తుల కేటాయింపు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ నిబంధనలకు అనుగుణంగా చేయడం, సర్పంచ్ పదవుల వేలం జరగకుండా చర్యలు తీసుకోవడం, ఓటర్ స్లిప్పుల పంపిణీ షెడ్యూలు, స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పోలింగ్ సామగ్రి సిద్ధంగా ఉందని, ఎస్పీ మహేష్ బి గీతే క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, అంతర్ జిల్లాల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
