రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముచ్చర్ల గ్రామంలో శనివారం అటవీ భూములను రైతులు ఆక్రమించుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. కావేటి రేణుక, కావేటి రాములు అనే ఇద్దరు రైతులు తమ పంట పొలాలకు ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతాన్ని నరికి, భూమిని చదును చేసుకుని పంటలు పండిస్తున్నారని ఆరోపణలున్నాయి. దీనిపై ఇద్దరి మధ్య గొడవ జరిగి పంచాయతీ వరకు వెళ్లింది. అటవీ అధికారుల అండతోనే ఈ ఆక్రమణలు జరుగుతున్నాయని రైతులు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు, వెంటనే బీట్ అధికారిని సంఘటనా స్థలానికి పంపించి, విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామస్తులు అటవీ భూములను రక్షించాలని కోరుతున్నారు.