ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సాధారణ, వ్యయ పరిశీలకులు

2చూసినవారు
ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ చేసిన సాధారణ, వ్యయ పరిశీలకులు
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రగుడు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 20 లక్షల నగదును సీజ్ చేసి, తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖీలో నోడల్ అధికారులు నవీన్ కుమార్, భారతి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్