తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలోని వృద్ధులు శనివారం త్యాగరాజస్వామి ఆరాధన ఉత్సవాలకు హాజరయ్యారు. ఇటీవల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, వృద్ధులను వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయంలోని భీమేశ్వర సదనంలో జరుగుతున్న శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధన ఉత్సవాలకు తీసుకువెళ్లాలని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజంను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వృద్ధులను ఉత్సవాలకు తరలించారు. తమకు ఈ అవకాశం కల్పించినందుకు వృద్ధులు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, మహిళా సాధికారిక కేంద్రం రోజా, ఓల్డ్ ఏజ్ హోం ఇంచార్జి మమత, అసిస్టెంట్ సూపరిండెంట్ విష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.