ప్రతిరోజూ సైక్లింగ్ చేయడం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని యువజన క్రీడల శాఖ అధికారి అజ్మీర రాందాస్ అన్నారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణంలో అంబేడ్కర్ విగ్రహం నుంచి బతుకమ్మ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైకిల్ వాడకం వల్ల ఇంధన ఆదాతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుందని, విద్యార్థి దశ నుంచే సైకిల్ వాడకంపై అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు.